Big Bash League: కిందా మీదా పడ్డాడు.. నీ కష్టం ఊరికే పోలేదు!

13 Dec, 2022 16:30 IST|Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 12వ సీజన్‌ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మెల్‌బోర్న్‌ స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుంది. ఫలితం సంగతి ఎలా ఉన్నా మ్యాచ్‌లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ బ్రాడీ కౌచ్‌ అందుకున్న క్యాచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ థండర్స్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌లోనే ఇదంతా చోటుచేసుకుంది.

బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్‌ రెండో బంతిని మాథ్యూ గైక్స్‌ మిడాన్‌ దిశగా ఆడాడు. అక్కడే నిల్చున్నబ్రాడీ కౌచ్‌ లో-లెవెల్‌లో వచ్చిన క్యాచ్‌ను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చేజారింది. ఆ తర్వాత బంతి అతని కాళ్లకు తాకి పైకి లేవగా అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మరోసారి మిస్‌ అయింది. చివరకు ఎలాగోలా బంతి సురక్షితంగా తీసుకోవడం జరిగింది. మొత్తానికి సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా వచ్చిన బ్రాడీ కౌచ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో అదరగొట్టాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. నిక్‌ లార్కిన్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. బర్న్స్‌ 18 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్‌ బౌలింగ్‌లో గురీందర్‌ సందు, ఫజల్‌హక్‌ ఫరుఖీ, డేనియల్‌ సామ్స్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. బ్రెండన్‌ డొగ్గెట్‌, క్రిస్‌ గ్రీన్‌ చెరొక వికెట్‌ పడగొట్టారు.

చదవండి: కోహ్లి, పంత్‌ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 10 వికెట్లు తీస్తారు..

మరిన్ని వార్తలు