మరణించిన క్రికెటర్‌కు ‘హ్యాపీ బర్త్‌డే‘ చెప్పిన బోర్డు!

4 May, 2021 16:26 IST|Sakshi

స్టేహోమ్‌, స్టేసేఫ్‌, టేక్‌ యువర్‌ వ్యాక్సిన్‌ అంటూ అశ్విన్‌ సెటైర్‌

ఢాకా:   మంజరుల్‌ ఇస్లామ్‌ రానా.. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ క్రికెటర్‌ 2007 లో మరణించాడు. 2003లో 19 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఇస్లామ్‌ రానా..  ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మైకేల్‌ వాన్‌ను మూడో బంతికే ఔట్‌ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఒక బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ తొలి ఓవర్‌లోనే వికెట్‌  తీయడం అదే మొదటిది.  కానీ ఇస్లామ్‌ రానా 22ఏళ్ల 316 రోజులకే తుదిశ్వాస విడిచాడు.  2007 వరల్డ్‌కప్‌కు బంగ్లాదేశ్‌ సన్నద్ధమవుతున్న తరుణంలో ఓ రోడ్డు ప్రమాదంలో ఇస్లామ్‌ రానా ప్రాణాలు కోల్పోయాడు. 

కాగా, ఈ రోజు అతని జయంతి. కానీ అతనికి బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) ట్వీట్‌ చేయడం వైరల్‌గా మారింది. ‘హ్యాపీ బర్త్‌డే ఇస్లామ్‌ రానా.. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన టెస్టు క్రికెటర్‌’ అని బీసీబీ ట్వీట్‌ చేసింది. అతని జయంతిని గుర్తుచేసుకునే క్రమంలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో బీసీబీ తప్పులో కాలేసినట్లయ్యింది. దీనిపై టీమిండియా క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ సెటైర్‌ వేశాడు. ‘స్టేహోమ్‌, స్టే సేఫ్‌, టేక్‌ యువర్‌ వ్యాక్సిన్‌’ అని కూడా చెప్పాల్సిందంటూ రిప్లై ఇచ్చాడు. 

ఇక్కడ చదవండి: IPL 2021 సీజన్‌ రద్దు: బీసీసీఐ


 

మరిన్ని వార్తలు