క్రికెట్‌ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌

20 Jan, 2021 18:16 IST|Sakshi

ముంబై : టీమిండియా అభిమానులకు బీసీసీఐ బుధవారం శుభవార్త తెలిపింది. ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనునన్న సిరీస్‌కు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించనున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంగ్లండ్‌ టూర్ మొత్తాన్ని కేవ‌లం మూడు స్టేడియాల‌కే మాత్రమే ప‌రిమితం చేశారు. చెన్నై, అహ్మ‌దాబాద్‌, పుణెల‌లో మొత్తం నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేలు జ‌ర‌గ‌నున్నాయి. అయితే వీటిలో కొన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్లు మాత్రం 20 నుంచి 25 శాతం మంది ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే అనుమ‌తించే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పొచ్చు.చదవండి: ఐపీఎల్‌: స్టార్‌ ఆటగాళ్లకు ఫ్రాంచైజీల షాక్‌

కాగా చివ‌రిసారి గ‌తేడాది జ‌న‌వ‌రిలో ఇండియా, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో ప్రేక్ష‌కులు ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్‌ను చూశారు. ఆ త‌ర్వాత కరోనా సంక్షోభం మొదలవడంతో భారత్‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌లేదు. కాగా కరోనా కారణంగా ఐపీఎల్ 13వ సీజన్‌ను కూడా బీసీసీఐ యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. కాగా దేశవాలి టోర్నీలైన రంజీ ట్రోఫీ, స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టోర్నీలు ప్రేక్ష‌కులు లేకుండానే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 5వ తేదిన చెన్నై వేదికగా జరగనుంది.(చదవండి: సీఎస్‌కేకు వెటరన్‌ ప్లేయర్‌ గుడ్‌బై)

మరిన్ని వార్తలు