కెప్టెన్‌గా గబ్బర్‌.. వైస్‌కెప్టెన్‌గా భువీ

11 Jun, 2021 08:08 IST|Sakshi

శ్రీలంకతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన  

ముంబై: టీమిండియా సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా రెండో జట్టు జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పర్యటనకు వెళ్లే జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది. ధావన్‌ కెప్టెన్‌గా.. భువనేశ్వర్‌ ​కుమార్‌ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కొన్నిరోజులగా చర్చ నడుస్తుంది. రెండు రోజల క్రితం గబ్బర్‌ పేరు ఖరారైనట్లు వార్తలు రావడం.. తాజాగా అతనికే పగ్గాలు అప్పజెప్పడంతో చర్చకు బ్రేక్‌ పడింది.

ఇక జట్టు విషయానికి వస్తే 20 మంది ఆటగాళ్లను ఎంపిక​ చేయగా.. ముందుగా ఊహించనట్టుగానే పృథ్వీ షా, పడిక్కల్‌, నితీష్‌ రాణా, సామ్సన్‌, రుతురాజ్‌, దీపక్‌ చహర్‌, చేతన్‌ సకారియాలు జట్టులో చోటు సంపాదించారు. అంతకముందు ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లు తన స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇక నెట్‌ బౌలర్లుగా  ఇషాన్‌ పొరేల్, సందీప్‌ వారియర్, అర్షదీప్‌ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్‌ సింగ్‌ ఉండనున్నారు.జూలైలో శ్రీలంకతో మూడు వన్డేలు.. మూడు టీ20లు ఆడనుంది.

జట్టు వివరాలు:  శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్, రుతురాజ్‌ గైక్వాడ్, సూర్యకుమార్‌ యాదవ్, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్, సంజు సామ్సన్, యజువేంద్ర చహల్, రాహుల్‌ చహర్, కె.గౌతమ్, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

నెట్‌ బౌలర్లు: ఇషాన్‌ పొరేల్, సందీప్‌ వారియర్, అర్షదీప్‌ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్‌ సింగ్‌

చదవండి: టీమిండియా ప్రాక్టీస్‌ అదుర్స్‌.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు