Team India Jersey Sponsership: బైజూస్‌తో అనుబంధాన్ని కొనసాగించనున్న బీసీసీఐ

7 Mar, 2022 19:20 IST|Sakshi

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) ప్రముఖ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషనల్ కంపెనీ బైజూస్‌తో అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ ముగిశాక బైజూస్‌తో టీమిండియా జెర్సీ ఒప్పందం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయించింది. భారత క్రికెట్‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్‌ను మరో ఏడాది పాటు పొడిగించనున్నట్లు బీసీసీఐ సోమవారం వెల్లడించింది.

2019 సెప్టెంబర్‌ నుండి బైజూస్‌ భారత క్రికెట్‌ జట్టు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. అంతకుముందు చైనీస్ మొబైల్ సంస్థ ఒప్పో టీమిండియా జెర్పీ స్పాన్సర్‌గా ఉండింది. జెర్సీ స్పాన్సర్‌షిప్‌కు గాను బైజూస్ ద్వైపాక్షిక సిరీస్‌లకు రూ. 4.61 కోట్లు, అంతర్జాతీయ మ్యాచ్‌లకు రూ. 1.56 కోట్లు బీసీసీఐకి చెల్లిస్తోంది.  
చదవండి: షేన్ వార్న్ హఠాన్మరణం వెనుక విస్తుపోయే నిజాలు..!

మరిన్ని వార్తలు