4 మహిళా క్రికెటర్లకు బీసీసీఐ ఎన్‌వోసీ.. కానీ

4 May, 2021 20:24 IST|Sakshi
Photo Courtesy:AFP

న్యూఢిల్లీ:  మరో రెండు నెలల్లో యూకే వేదికగా జరుగనున్న ‘ద హండ్రెడ్‌’ టోర్నీలో పాల్గొనే నలుగురు భారత మహిళా క్రికెటర్లకు బీసీసీఐ ఎన్‌వోసీ ఇచ్చింది. టీ20 క్రికెట్‌కు కాస్త భిన్నంగా ఒక ఇన్నింగ్స్‌లో వంద బంతులు ఆడే ఈ టోర్నీలో 8 మహిళా జట్లు పాల్గొంటున్నాయి. ఒకవైపు మెన్స్‌ ద హాండ్రెడ్‌ జరిగే సమయంలోనే వుమెన్న్‌ టోర్నీకి నిర్వహించనున్నారు. జూలై 21వ తేదీన ఈ టోర్నీ ఆరంభం కానుంది.

ఇందులో భారత్‌ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లు పాల్గొనున్నారు. ఈ మేరకు బీసీసీఐకి ఎన్‌వోసీ అప్లై చేయగా అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఇప్పటికే టీమ్‌ సెలక్షన్‌ జరిగిపోతుండటంతో అంతా అందులో పాల్గొనాల్సిందే. భారత్‌ నుంచి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మందనా, దీప్తి, జమీమా రోడ్రిగ్స్‌లు ఇందులో పాల్గొనున్నారు. కాగా, వీరు మే 27వ తేదీన సదరు ఫ్రాంచైజీలకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో భారత్‌ నుంచి విమానాలను యూకే ప్రభుత్వం రెడ్‌ లిస్ట్‌లో పెట్టడంతో వీరు ఆ లీగ్‌కు ఎలా వెళతారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. 

ఇక్కడ చదవండి: IPL 2021: ఐపీఎల్‌ రీషెడ్యూల్‌.. బీసీసీఐ ఆప్షన్లు ఇవే..!
IPL 2021 సీజన్‌ రద్దు: బీసీసీఐ

మరిన్ని వార్తలు