ఐపీఎల్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌

10 May, 2022 16:00 IST|Sakshi

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ వచ్చింది. రాబోయే సీజన్లలో ఐపీఎల్ పరిధి పెంచేలా బీసీసీఐ.. ఐసీసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మహిళల ఐపీఎల్‌ నిర్వహణతో పాటు పురుషుల ఐపీఎల్‌ మ్యాచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ పోవాలని బీసీసీఐ భావిస్తుంది. ఐపీఎల్ ద్వారా వచ్చే లాభాలు ఏ ఏటికాయేడు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఐసీసీ తమ అంగీకారాన్ని తెలిపితే.. వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌ల సంఖ్య మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. 

గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీల చేరికతో ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు చేరగా, వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఐపీఎల్‌ మ్యాచ్‌ల సంఖ్య ఇలా పెరుగుకుంటూ పోతే సంప్రదాయ సిరీస్‌లు తగ్గుముఖం పట్టడమే కాకుండా వాటి ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులకు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కొత్త జట్ల చేరికతో బీసీసీఐ ఖజానాలో అదనంగా 8000 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఆర్పీ-సంజీవ్ గోయెంకా, గుజరాత్ టైటాన్స్‌ జట్టును సీవీసీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నాయి.
చదవండి: 'ఈ సీజన్‌ మాకు కలిసిరాలేదు'.. సూర్యకుమార్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

మరిన్ని వార్తలు