Sourav Ganguly New House: ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు

20 May, 2022 10:40 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కోల్‌కతాలో కొత్త బంగ్లాను కొనుగోలు చేశాడు. గంగూలీ కొనుగోలు చేసిన కొత్త బంగ్లా విలువ సుమారు రూ. 40 కోట్లు అని సమాచారం. గంగూలీ 48 సంవత్సరాల అనంతరం తన పూర్వీకుల ఇంటి నుంచి కొత్త భవనంలోకి మారనుండడంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.

ఇక కోల్‌కతాలోని లోవర్‌ రాడన్‌ స్ట్రీట్‌లో 23.6 కొత్తా(దాదాపు 10,280 స్క్వేర్‌ఫీట్‌) కలిగిన రెండంతస్తుల భవనాన్ని గంగూలీ కొనుగోలు చేశాడు. ఈ ప్రాపర్టీ మొత్తాన్ని భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్‌ గంగూలీ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్‌ చేసినట్లు సమాచారం. పాత భవనమే అయినప్పటికి.. రోడ్డుకు దగ్గరగా ఉండడం.. టవర్‌ డెవలప్‌మెంట్‌కు అనుమతి ఉండడంతో దాదా ఎంతో ఇష్టంతో కొనుగోలు చేశాడు. 

చదవండి: Matthew Wade: డ్రెస్సింగ్‌ రూమ్‌ వినాశనం; వార్నింగ్‌తో సరి..

మరిన్ని వార్తలు