ఉత్తమ క్రికెటర్ల జాబితా విడుదల; టెస్టుల్లో పంత్‌.. టి20ల్లో సూర్య

31 Dec, 2022 21:44 IST|Sakshi

2022 ఏడాదికి గానూ టీమిండియా నుంచి మూడు ఫార్మట్లలో ఉత్తమ ప్రదర్శన చేసిన క్రికెటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో టెస్టు ఫార్మాట్‌లో బ్యాటింగ్‌ విభాగంలో పంత్‌ చోటు దక్కించుకోగా.. బౌలింగ్‌ విభాగంలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఎంపికయ్యాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌, మహ్మద్‌ సిరాజ్‌లు.. టి20 ఫార్మాట్‌ నుంచి సూర్యకుమార్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌లకు చోటు కల్పించింది.

టెస్టుల్లో పంత్‌, బుమ్రా
ఈ ఏడాది 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పంత్ 680 ప‌రుగులు సాధించాడు. వీటిలో రెండు సెంరీలు, నాలుగు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా ఈ ఏడాది అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఐదుటెస్టుల్లో 20.31 స‌గ‌టుతో 22 వికెట్లు తీశాడు. రెండుసార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.

వ‌న్డే ఫార్మాట్‌లో.. 
మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయాస్ అయ్య‌ర్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 17 మ్య‌చ్‌లు ఆడిన అయ్య‌ర్ 55.69 స‌గటుతో 724 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో మొహ‌మ్మ‌ద్ సిరాజ్ ఈ ఏడాది ఆక‌ట్టుకున్నాడు. 15 మ్యాచుల్లో అత‌ను 24 వికెట్లు తీశాడు.

టి20 ఫార్మాట్‌లో..
సూర్య‌కుమార్ యాద‌వ్ ఉత్త‌మ భార‌త ఆట‌గాడిగా ఎంపిక‌య్యాడు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌, న్యూజిలాండ్ సిరీస్‌లో త‌న ట్రేడ్‌మార్క్ షాట్ల‌తో విరుచుక ప‌డిన అత‌ను ఈ ఏడాది 31 మ్యాచుల్లో 1,164 ప‌రుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి ఆడిన అత‌ను 2022లో రెండు శ‌త‌కాలు, తొమ్మిది అర్థ‌శ‌త‌కాలు బాదాడు. సీనియ‌ర్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ బెస్ట్ బౌల‌ర్‌గా సెల‌క్ట్ అయ్యాడు. 32 టీ20ల్లో భువీ 37 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

చదవండి: తప్పుడు వార్తలు.. తాగి నడిపితే 200 కిమీ దూరం ఎలా వస్తాడు!

వేలు విరిగిన విషయం తెలియక నాలుగు గంటలు ఓపికగా

మరిన్ని వార్తలు