Bio Bubble: భారత క్రికెటర్లకు శుభవార్త.. బయో బబుల్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం..!

6 Apr, 2022 13:54 IST|Sakshi

BCCI: భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఓ శుభవార్త వచ్చింది. కోవిడ్‌ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఆటగాళ్ల మానసిక ఒత్తిడికి కారణమవుతున్న బుడగ (బయో బబుల్‌) నిబంధనలను ఎత్తి వేయాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. బుడగ నిబంధనల వల్ల ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దేశంలో కోవిడ్‌ ప్రభావం కూడా తగ్గుముఖం పడతుండడంతో బయో బబుల్‌ నిబంధనలకు పూర్తిగా స్వస్థి పలకాలని బీసీసీఐ యోచిస్తుంది. దీంతో ఈ నెల (ఏప్రిల్) నుంచే ఆటగాళ్లకు బుడగ నిబంధనల నుంచి విముక్తి కల్పించాలని భావిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ వెసులుబాటు దేశవాళీ క్రికెటర్లకు మాత్రమేనని తెలుస్తోంది. త్వరలో రెండు దేశవాళీ టోర్నీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 18 నుంచి అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీతో పాటు సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 
చదవండి: IPL 2022: శతక్కొట్టిన ఆర్సీబీ.. అంబరాన్నంటిన సంబురాలు

>
మరిన్ని వార్తలు