Rishabh Pant: బీసీసీఐ మంచి మనసు.. పంత్‌ క్రికెట్‌ ఆడకపోయినా ఫుల్ సాలరీ!

8 Jan, 2023 20:31 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు బీసీసీఐ మరో సారి అండగా నిలిచింది. ఇప్పటికే పంత్ ఆరోగ్యాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.  రాబోయే ఆరేడు నెలలు గాయంతో పంత్‌ క్రికెట్ కు దూరమైనా అతడి మొత్తం జీతాన్ని చెల్లించాలని బీసీసీఐ నిర్ణయించింది.

పంత్‌ ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ-ఎలో ఉన్నాడు. అంటే ప్రతీ ఏటా రూ.5 కోట్ల రూపయాలు జీతం రూపంలో పంత్‌కు అందనుంది. ఇప్పుడు పంత్‌ కొన్ని నెలలపాటు క్రికెట్‌కు దూరమైన అతడికి ఫుల్‌ సాలరీ అందనుంది. అదే విధంగా పంత్‌కు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కాంట్రాక్టు కూడా ఉంది.  

ఇందుకు గాను రూ. 16 కోట్ల వేతనం అందుతుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్‌ ఈ ఏడాది ఐపీఎల్‌కు దాదాపు దూరమైనట్లే అని చేప్పుకోవాలి. ఈ క్రమంలో ఐపీఎల్‌-2023 ఆడక​పోయినా మొత్తం చెల్లాంచాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

కాగా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందిన ఆటగాళ్లందరికి బీమా ఉంటుంది. వారిలో ఎవరైనా గాయపడితే బోర్డు మొత్తం చెల్లుస్తుంది. ఐపీఎల్‌లో కూడా ఇదే విధానం అమల్లో ఉంది. అయితే ఐపీఎల్‌లో సంబంధిత ఫ్రాంచైజీ కాకుండా బీమా సంస్ధలు ఆటగాడికి రావల్సిన మొత్తాన్ని చెల్లిస్తాయి.

ఇక ముంబైలోని కోకిలాబెన్ దీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి మోకాలి సర్జరీ కూడా విజయవంతమైంది. అయితే అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 8 నుంచి 9 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
చదవండిWTC FINAL RACE: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా! మరి టీమిండియా సంగతి?

మరిన్ని వార్తలు