IND Vs ZIM: జింబాబ్వేతో తొలి వన్డే.. ఇషాన్‌ కిషన్‌కు తప్పిన ప్రమాదం!

18 Aug, 2022 18:18 IST|Sakshi

టీమిండియా యువ ఆటగాడు ఇషన్‌ కిషన్‌పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్‌-జింబాబ్వే మధ్య జరుగుతోన్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారత జట్టు జాతీయ గీతం ఆలపిస్తుండగా కిషన్‌పై తేనేటీగలు దాడి చేశాయి. దీంతో ఒక్క సారిగా కిషన్‌ ఉలిక్కిపడ్డాడు. అయితే  అదృష్టవశాత్తు ఈ ఘటనలో అతడికి ఎటువంటి హాని జరగలేదు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత కొన్ని సిరీస్‌ల నుంచి కేవలం బెంచ్‌కే పరిమితవుతున్న కిషన్‌కు ఈ మ్యచ్‌కు భారత తుది జట్టులో చోటు దక్కింది. కాగా ఇటీవల కాలంలో స్టేడియాల్లో ఆటగాళ్లపై తేనెటీగ దాడులు సర్వసాధారణం అయిపోయాయి. తాజగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి వన్డేలో పాక్‌ బ్యాటర్‌ ఫఖర్‌ జమన్‌ కూడా  తేనేటీగల దాడికి గురయ్యాడు.

ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 189 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో చహర్‌, ప్రసిధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ ఒక్క వికెట్‌ తీశాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టెయిలండర్లు రిచర్డ్‌ నగరవా(34), బ్రాడ్‌ ఎవన్స్‌(33) అద్భుతమైన ఆటతీరుతో అకట్టుకున్నారు.


చదవండి: IND vs ZIM: ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్‌!

మరిన్ని వార్తలు