ఒలింపిక్‌ మాజీ స్విమ్మర్‌కు 12 ఏళ్ల జైలుశిక్ష

27 Dec, 2022 18:54 IST|Sakshi

బెలారస్‌కు చెందిన మాజీ ఒలింపిక్‌ స్విమ్మర్‌ అలియాక్సాండ్రా హెరాసిమేనియాకు 12 ఏళ్ళ జైలుశిక్ష పడింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఆమె చర్యలు ఉన్నాయని.. ఆమె వల్ల దేశానికి హాని పొంచి ఉందన్న కారణంతో ఈ శిక్ష విధిస్తున్నట్లు మింక్స్‌ కోర్టు తెలిపింది. అలియాక్సాండ్రాతో పాటు ఆమె స్నేహితుడు పొలిటికల్‌ యాక్టివిస్ట్‌ అలెగ్జాండర్ ఒపేకిన్‌కు కూడా 12 ఏళ్ల జైలుశిక్ష విధించినట్లు పేర్కొంది.

అలెగ్జాండర్ లుకాషెంకో యొక్క నిరంకుశ పాలనను నిరసించడంలో హెరాసిమేనియా, ఒపేకిన్ ముందు వరుసలో నిలిచి అపఖ్యాతిని సంపాదించుకున్నారని.. అందుకే వారి వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి జైలుశిక్ష విధించారని న్యూస్‌ బీటీ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అలియాక్సాండ్రా మూడుసార్లు ఒలింపిక్‌ మెడల్స్‌ సొంతం చేసుకుంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగం, 100 మీటర్ల ఫ్రీసైల్‌  విభాగంలో సిల్వర్‌ మెడల్‌ గెలిచిన ఆమె.. 2016 రియో ఒలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టైల్‌ విభాగంలో కాంస్య పతకం సాధించింది. 

మరిన్ని వార్తలు