హామిల్టన్‌కే ‘పోల్‌’ 

30 Aug, 2020 08:50 IST|Sakshi

నేడు బెల్జియం గ్రాండ్‌ప్రి 

స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్‌ (బెల్జియం): ఈ సీజన్‌లో తన జోరును కొనసాగిస్తూ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఐదోసారి ‘పోల్‌ పొజిషన్‌’ సంపాదించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌ సెషన్‌లో ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.252 సెకన్లలో ముగించాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. హామిల్టన్‌ సహచరుడు, మెర్సిడెస్‌ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్‌ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు రేసులు జరగ్గా... నాలుగింటిలో హామిల్టన్‌ విజయం సాధించాడు. బొటాస్‌ (మెర్సిడెస్‌), వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఒక్కో విజయాన్ని అందుకున్నారు. నేటి సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు మొదలయ్యే బెల్జియం గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును స్టార్‌ స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–2 చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.  

గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. బొటాస్‌ (మెర్సిడెస్‌), 3. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 4. రికియార్డో (రెనౌæ), 5. ఆల్బోన్‌ (రెడ్‌బుల్‌), 6. ఒకాన్‌ (రెనౌ), 7. కార్లోస్‌ సెయింజ్‌ (మెక్‌లారెన్‌), 8. సెర్గియో పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 9. లాన్స్‌ స్ట్రోల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 10. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌), 11. డానిల్‌ క్వియాట్‌ (అల్ఫా టౌరి), 12. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 13. చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 14. వెటెల్‌ (ఫెరారీ), 15. జార్జి రసెల్‌ (విలియమ్స్‌), 16. రైకోనెన్‌ (అల్ఫా రోమియో), 17. గ్రోస్యెన్‌ (హాస్‌), 18. గియోవినాజి (అల్ఫా రోమియో), 19. నికోలస్‌ లతిఫి (విలియమ్స్‌), 20. మాగ్నుసెన్‌ (హాస్‌). 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా