PSL 2022: పాత గొడవను గుర్తుచేసి కౌంటర్‌ ఇద్దామనుకున్నాడు.. బెడిసికొట్టింది

16 Feb, 2022 11:40 IST|Sakshi

పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తనకు చేసిన అవమానాన్ని గుర్తుతెచ్చుకున్న బ్యాట్స్‌మన్‌ సదరు బౌలర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. అయితే చివరికి ఆ ప్లాన్‌ తనకే బెడిసి కొట్టింది. ఆ బ్యాట్స్‌మన్‌ ఆస్ట్రేలియా డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ కటింగ్‌ అయితే.. బౌలర్‌ పాకిస్తాన్‌ క్రికెటర్‌ సోహైల్‌ తన్వీర్‌. 

చదవండి: IPL 2022 Auction: నన్నంటే కొనలేదు.. అతడిని కూడానా.. నిజంగా షాకయ్యా!

విషయంలోకి వెళితే.. 2018లో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన్వీర్‌ గయానా అమెజాన్‌ వారియర్స్‌ తరపున.. బెన్‌ కటింగ్‌ సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియోట్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించారు. కాగా బెన్‌ కటింగ్‌ను ఔట్‌ చేసిన తర్వాత సోహైల్‌ తన్వీర్‌ కటింగ్‌ను చూస్తూ తన రెండు చేతులతో మిడిల్‌ ఫింగర్‌ చూపించాడు. దీనిని బెన్‌ కటింగ్‌ నాలుగేళ్లుగా మనసులో పెట్టుకున్నాడని తాజా ఘటనతో అర్థమైంది.

మంగళవారం రాత్రి పెషావర్‌ జాల్మీ, క్వెటా గ్లాడియేటర్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. కాగా  పెషావర్‌ జాల్మి ఇన్నింగ్స్‌ సమయంలో తన్వీర్‌ వేసిన 19వ ఓవర్లో బెన్‌ కటింగ్‌ మూడు సిక్సర్లతో హోరెత్తించాడు. ఆ తర్వాత తన్వీర్‌వైపు తిరిగి రెండు చేతులు పైకెత్తి మిడిల్‌ ఫింగర్‌ చూపించి నాలుగేళ్ల క్రితం తనకు జరిగిన అవమానాన్ని సరిచేశానని భావించాడు. ఇది ఇంతటితో ముగిసిపోలేదు. నసీమ్‌ షా వేసిన చివరి ఓవర్‌లో భారీ షాట్‌కు యత్నించి బెన్‌ కటింగ్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద తన్వీర్‌కే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక తన్వీర్‌ ఊరుకుంటాడా.. వెంటనే తన రెండు చేతులు పైకెత్తి మిడిల్‌ ఫింగర్‌ చూపించి దెబ్బకు దెబ్బ తీశాడు. ఆ విధంగా తన్వీర్‌.. కటింగ్‌పై మరోసారి  పైచేయి సాధించినట్లయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

చదవండి: IPL 2022: కేన్‌ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ..

ఇక మ్యాచ్‌లో పెషావర్‌ జాల్మి 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పెషావర్‌ జాల్మి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. షోయబ్‌ మాలిక్‌ 58, తలాత్‌ 51, బెన్‌ కటింగ్‌ 36 పరుగులు చేశాడు. క్వెటా గ్లాడియేటర్స్‌ బౌలింగ్‌లో నసీమ్‌ షా 4 వికెట్లు తీశాడు. కుర్రమ్‌ షెహజాద్‌, గులామ్‌ ముదస్సార్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన క్వెటా గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. విల్‌ స్మీద్‌ 99 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్సయ్యాడు. అయితా మిగతావారు పెద్దగా రాణించకపోవడంతో క్వెటా ఓటమిపాలైంది.

మరిన్ని వార్తలు