ENG vs NZ: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా

18 Feb, 2023 11:43 IST|Sakshi

ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగా స్టోక్స్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో జరగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్‌ తన మొదటి సిక్స్‌తో ఈ రికార్డును తన పేరిట లిఖించకున్నాడు.

ఇప్పటి వరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ మెకల్లమ్ పేరిట ఉండేది. తన కెరీర్‌లో 101 మ్యాచ్‌లు ఆడిన మెకల్లమ్107 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌తో మెకల్లమ్ రికార్డును స్టోక్స్‌ బ్రేక్‌ చేశాడు.

కాగా స్టోక్స్‌ ఇప్పటివరకు 90 మ్యాచుల్లో 108 సిక్స్‌లు కొట్టాడు. ఇక తర్వాత స్థానాల్లో ఆడమ్ గిల్ క్రిస్ట్ (100), క్రిస్‌ గేల్‌(98), జాక్వెస్ కల్లీస్ (97) వరసగా ఉన్నారు. కాగా ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేసిన స్టోక్స్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేశాడు.

ఇక ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 365 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్‌ 384 పరుగుల ముందంజలో ఉంది. కాగా టెస్టు మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ వన్డే తరహాలో ఆడుతోంది. 
చదవండి: Cheteshwar Pujara: అయ్యో పుజారా! ఒకే ఒక్కడు.. తొలి క్రికెటర్‌.. కానీ పాపం..

మరిన్ని వార్తలు