Womens WC 2022: బ్యాట్‌తోనే అనుకుంటే.. స్టన్నింగ్‌ క్యాచ్‌తోనూ మెరిసింది

30 Mar, 2022 18:04 IST|Sakshi

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్‌ ఏడోసారి టైటిల్‌ గెలిచేందుకు ఫైనల్లో అడుగుపెట్టింది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో బెత్‌ మూనీ చివర్లో దాటిగా ఆడి 31 బంతుల్లోనే 3 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో మెరిసిన బెత్‌ మూనీ.. అనంతరం ఫీల్డింగ్‌లోనూ సత్తా చాటింది.

వర్షం అంతరాయంతో 45 ఓవర్లకు కుదించగా.. 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఉమెన్స్‌కు ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లోనే షాక్‌ తగిలింది. విండీస్‌ ఓపెనర్‌ రషదా విలియమ్స్‌ను.. మేఘన్‌ స్కట్‌డకౌట్‌గా పెవిలియన్‌గా చేర్చింది. అయితే ఇక్కడ హైలైట్‌ అయింది మాత్రం బెత్‌ మూనీనే. విలియమ్స్‌.. కవర్‌ డ్రైవ్‌ దిశగా షాట్‌ ఆడగా అక్కడే ఉన్న బెత్‌ మూనీ విల్లుగా ఒకవైపుగా డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ మహిళా జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హేన్స్‌(85), హేలీ(129) అదిరిపోయే ఆరంభం అందించారు. బెత్‌ మూనీ 43 పరుగులతో అజేయంగా నిలిచింది. ఈ ముగ్గురి అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియా నిర్ణీత 45 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 305 పరుగుల భారీ స్కోరు సాధించింది.లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్‌ డియాండ్ర డాటిన్‌ శుభారంభం అందించింది. 34 పరుగులతో రాణించింది. వన్‌డౌన్‌లో వచ్చిన హేలీ మాథ్యూస్‌ 34, కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ 48 పరుగులు సాధించారు. ఆ తర్వాత టపటపా వికెట్లు పడ్డాయి. ఒక్కరు కూడా డబుల్‌ డిజిట్‌ స్కోరు చేయలేకపోయారు. దీంతో 37 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌట్‌ అయి వెస్టిండీస్‌ కుప్పకూలింది.

చదవండి: అజేయ రికార్డును కొనసాగిస్తూ.. వెస్టిండీస్‌ను చిత్తు చేసి.. భారీ విజయంతో ఫైనల్‌కు

Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్‌

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు