కరోనా బారిన భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ 

7 Sep, 2021 07:32 IST|Sakshi
భరత్‌ అరుణ్,ఆర్‌.శ్రీధర్‌,రవిశాస్త్రి

లండన్‌: లండన్‌లో ఉన్న భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌లు కూడా కోవిడ్‌–19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారం, ఆదివారం చేసిన ర్యాపిడ్‌ టెస్టుల్లో రవిశాస్త్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఇంగ్లండ్‌తో  మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టుకు వీరు అందుబాటులో ఉండరు.

చదవండి: సిరీస్‌ వేటలో విజయబావుటా  

మరిన్ని వార్తలు