కత్తి దూసేనా...

26 Jul, 2021 06:25 IST|Sakshi

ఒలింపిక్స్‌ ఫెన్సింగ్‌ పోటీల్లో పాల్గొనబోతున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవి పోరాటం నేడు మొదలుకానుంది. మహిళల వ్యక్తిగత సేబర్‌ ఈవెంట్‌ తొలి రౌండ్‌లో ఆమె పోటీపడనుంది. నాకౌట్‌ పద్ధతిలో జరిగే ఈ ఈవెంట్‌లో భవానీ దేవి పతకం రేసులో నిలవాలంటే కనీసం సెమీఫైనల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.  
మహిళల సేబర్‌ తొలి రౌండ్‌: భవానీ దేవి vs నదియా (ట్యునీషియా); ఉదయం గం. 5:30 నుంచి


ఆ ఇద్దరిపైనే ఆశలు...
పోటీల తొలి రెండు రోజులు భారత షూటర్లు నిరాశ పరిచారు. ఒక్కరు కూడా పతకం నెగ్గలేకపోయారు. మూడో రోజు పురుషుల స్కీట్‌ విభాగంలో అంగద్‌ వీర్‌ బాజ్వా, మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ పతకాల కోసం బరిలో ఉన్నారు. సోమవారం క్వాలిఫయింగ్‌–2లో వీరిద్దరు కనబరిచిన స్కోరు ఆధారంగా ఫైనల్‌ చేరుకుంటారో లేదో ఆధారపడి ఉంది. 30 మంది క్వాలిఫయింగ్‌లో పోటీపడుతుండగా టాప్‌–6 షూటర్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.  
అంగద్‌ వీర్‌ బాజ్వా, మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్‌  (పురుషుల స్కీట్‌ క్వాలిఫయింగ్‌–2; ఉదయం గం. 6:30 నుంచి)... ఫైనల్‌ (మధ్యాహ్నం గం. 12:20 నుంచి)
 

>
మరిన్ని వార్తలు