IND VS SA T20 Series: భువనేశ్వర్‌ ఖాతాలో మరో అరుదైన రికార్డు

20 Jun, 2022 21:45 IST|Sakshi

Bhuvneshwar Kumar: టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా ఎంపికైన భువీ.. తన 10 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో నాలుగోసారి ఈ ఘనతను సాధించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో మరే పేసర్‌ ఇన్నిసార్లు (4) ఈ అవార్డును గెలుచుకోలేదు. గతంలో జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మలు మూడు సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు గెలుచుకోగా.. తాజాగా భువీ వారిద్దరినీ వెనక్కునెట్టి ఈ ఘనత సాధించిన తొలి భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో టాప్‌ ఫామ్‌లో కనిపించిన భువీ పవర్‌ ప్లేలో అదరగొట్టాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 6.05 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు. ఇక, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో హర్షల్‌ పటేల్‌ (7) టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. అయితే భువీ వికెట్లతో పాటు పవర్‌ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కించుకున్నాడు.
చదవండి: టీ20 వరల్డ్‌కప్‌-2022కు సంబంధించి కీలక ప్రకటన

మరిన్ని వార్తలు