MI vs SRH: డెత్‌ ఓవర్లు.. మరింత కామ్‌గా ఉండాలి... అప్పుడే: భువనేశ్వర్‌ కుమార్‌

18 May, 2022 16:51 IST|Sakshi
ఉమ్రాన్‌ మాలిక్‌, భువనేశ్వర్‌ కుమార్‌(PC: IPL/BCCI)

IPL 2022 SRH vs MI: Bhuvneshwar Kumar Comments: ‘‘డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసేటపుడు కూల్‌గా ఉండాలి. అలాంటి కీలక సమయంలో ఒక్క బౌండరీ వెళ్లినా ఒత్తిడిలో కూరుకుపోతాం. అయితే, అప్పుడే మనం మరింత కామ్‌గా ఉండాలి. ఒత్తిడిని జయిస్తేనే ప్రణాళికను పక్కాగా అమలు చేయగలం’’ అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. డెత్‌ ఓవర్‌ స్పెషలిస్టు అయిన భువీ.. తన సహచర ఆటగాడు, స్టార్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు ఆట గురించి ఈ మేరకు సలహాలు ఇచ్చాడు.

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మూడు పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లో రాహుల్‌ త్రిపాఠి(76), ప్రియమ్‌ గార్గ్‌(42), నికోలస్‌ పూరన్‌(38) రాణించారు. ఇక ఉమ్రాన్‌ మాలిక్‌ 3 కీలక వికెట్లు పడగొట్టగా.. భువీ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ముఖ్యంగా 19వ ఓవర్‌ను మెయిడెన్‌ చేసి సన్‌రైజర్స్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఉమ్రాన్‌తో సంభాషణలో భాగంగా.. ‘‘అదృష్టవశాత్తూ 19వ ఓవర్‌ మెయిడెన్‌ అయింది. నిజానికి యార్కర్లు వేయడానికి ప్రయత్నించాను. పరుగులు లభిస్తున్న వికెట్‌పై యార్కర్లు సంధించడమే సరైన ఆప్షన్‌ అని భావించాను. లక్కీగా అన్నీ సరైన స్పాట్‌లో బౌల్‌ చేయగలిగాను. నా ప్రణాళికను పక్కాగా అమలు చేశాను’’ అని భువనేశ్వర్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 65: ముంబై ఇండియన్స్‌ వర్సెస్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్కోర్లు:
సన్‌రైజర్స్‌-193/6 (20)
ముంబై- 190/7 (20)

చదవండి👉🏾Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్‌
చదవండి👉🏾Eng Vs NZ Test Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. వెరీ స్పెషల్‌.. వాళ్లిద్దరికీ చోటు!

>
Poll
Loading...
మరిన్ని వార్తలు