Big Bash 2021: డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌.. గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్‌ మజాక్‌ 

14 Dec, 2021 16:58 IST|Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా కామెంటేటర్స్‌ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్‌ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్‌లు.. పంచ్‌లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్‌బాష్‌ లీగ్‌ 2021లో  భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్‌ 12న మెల్‌బోర్న్‌ స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య సీరియస్‌గా మ్యాచ్‌ జరుగుతుంది. 

చదవండి: BBL 2021: కొలిన్‌ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలో 27వ సెంచరీ

ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్‌ సందర్భంగా కామెంటరీ ప్యానెల్‌ మధ్య స్పిన్‌ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్‌ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్‌ బాల్‌ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్‌ బాల్‌ వేయాలంటే .. ఒక బౌలర్‌ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌ వచ్చేలా మాట్లాడడంతో గిల్‌క్రిస్ట్‌ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్‌ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. ''డబుల్‌ మీనింగ్‌ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్‌ చేశారు.   

చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్‌.. తృటిలో తప్పించుకున్న రూట్‌

ఇక మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 

మరిన్ని వార్తలు