IPL 2022: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌కు బిగ్‌షాక్‌

6 Apr, 2022 16:35 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఆర్‌సీబీతో మ్యాచ్‌లో ఓటమితో షాక్‌లో ఉన్న రాజస్తాన్‌ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌నీల్‌ సీజన్‌ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్తాన్‌ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా స్వయంగా ప్రకటించింది. కాగా ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కౌల్టర్‌ నీల్‌ ఆడాడు. ఆటలో చివరి ఓవర్‌ బౌలింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు.

గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రస్తుతం అతనికి రెస్ట్‌ అవసరమని వైద్యులు దృవీకరించారు. కౌల్టర్‌ నీల్‌ తాను కోలుకునే వరకు స్వదేశంలో రీహాబిటేషన్‌లో గడపనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్‌ రాయల్స్‌.. ''తొందరగా కోలుకో.. మనం మళ్లీ కలుద్దా ఎన్‌సీఎన్‌(నాథన్‌ కౌల్టర్‌ నీల్‌)'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా కౌల్టర్‌ నీల్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరని ఎంపిక చేస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన కౌల్టర్‌ నీల్‌ 48 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘన విజయం సాధించింది.

ఇక ఐపీఎల్‌ మెగావేలంలో రాజస్తాన్‌ రూ. 2 కోట్లకు నాథన్‌ కౌల్టర్‌ నీల్‌ను దక్కించుకుంది. కౌల్టర్‌ నీల్‌ ఐపీఎల్‌లో 38 మ్యాచ్‌లాడి 48 వికెట్లు పడగొటగ్టాడు. ఐపీఎల్‌లో మధ్యలోనే వైదొలగడం కౌల్టర్‌ నీల్‌కు ఇది రెండోసారి. ఇంతకముందు 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక కండరాల గాయంతో 2021 ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరంగా ఉ‍న్నాడు. మంగళవారం రాత్రి ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఓటమి పాలైంది. ఒక దశలో మ్యాచ్‌లో పట్టు చిక్కినప్పటికి.. దినేశ్‌ కార్తిక్‌ విధ్వంసానికి తోడూ.. షాబాజ్‌ అహ్మద్‌ నిలకడైన ఆటతీరుతో ఆర్‌సీబీ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ ఏప్రిల్‌ 10న లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆడనుంది.

చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు'

Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు