వన్డే ప్రపంచకప్‌ను గెలవడమే మా లక్ష్యం: హార్ధిక్‌ పాండ్యా

2 Jan, 2023 21:43 IST|Sakshi

2023 ఏడాదిలో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమైంది. ముంబై వేదికగా జనవరి 3న శ్రీలంకతో తొలి టీ20లో తలపడేందుకు హార్దిక్‌ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు తలపడనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 

స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడమే ఈ ఏడాది భారత జట్టు లక్ష్యమని హార్దిక్‌ తెలిపాడు. హార్దిక్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "ప్రపంచకప్‌ను గెలవడమే ఈ ఏడాది మా జట్టు అతి పెద్ద రిజల్యూషన్. నిజంగా ప్రపంచ కప్‌ను గెలవాలనుకుంటున్నాము. అందుకోసం అన్ని విధాల మేము సన్నద్దం అవుతాము.

ప్రస్తుతం మా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. కాబట్టి ఈ ఏడాది ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటామన్న నమ్మకం నాకు ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూడా మేము మా శక్తికి మించి ప్రయత్నించాం. కానీ మేము మా లక్ష్యాన్ని నేరవేర్చుకోలేకపోయాం.

దురదృష్టవశాత్తు సెమీస్‌లోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో కూడా 100% శాతం ఎఫక్ట్‌ పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము. అంతకంటే ముందు శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్‌లపై మేము దృష్టి సారించాల్సి ఉంది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండిIND vs AUS: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. పంత్‌ దూరం! ఆంధ్రా ఆటగాడు అరంగేట్రం..

మరిన్ని వార్తలు