IPL 2022: జింబాబ్వే స్టార్‌ బౌలర్‌కు బంపర్‌ ఆఫర్‌.. తొలిసారి ఐపీఎల్‌లో!

22 Mar, 2022 11:20 IST|Sakshi

ఐపీఎల్‌-2022 సీజన్‌కు లక్నో సూపర్ జెయింట్స్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ దూరమైన సంగతి తెలిసిందే.‍ ఈ క్రమంలో మార్క్ వుడ్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు లక్నో ఫ్రాంచైజీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో వుడ్ స్ధానాన్ని జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీతో భర్తీ చేయాలని లక్నో ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దాదాపు అతడు ఐపీఎల్‌లో పాల్గోవడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ కోసం ముజారబానీ భారత్‌కు బయలుదేరినట్లు జింబాబ్వేలోని భారత రాయబారి కార్యాలయం ద్రువీకరించింది. అయితే ముజారబానీని వుడ్‌ స్ధానంలో భర్తీ చేస్తారా లేదా నెట్ బౌలర్‌గా ఎంపిక చేస్తారా అన్నది వేచి చూడాలి. కాగా అంతకుముందు వుడ్‌ స్ధానాన్ని బంగ్లాదేశ్‌ పేసర్‌ టాస్కిన్‌ ఆహ్మద్‌తో భర్తీ చేయాలని భావించింది.

అయితే అతడు దక్షిణాప్రికా పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ జట్టులో భాగమై ఉన్నాడు. దీంతో అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతిని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు నిరాకరించింది. దీంతో అతడి స్థానంలో ముజారబానీని జట్టులో తీసుకోనున్నారు. ఇక మార్చి 26 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు తెరలేవనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ తన తొలి మ్యాచ్‌లో మార్చి 28 మరో కొత్త జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది.

చదవండి: IPL 2022: ఆఫ్ఘనిస్తాన్ యువ బౌలర్‌కు లక్కీ ఛాన్స్‌.. ఏకంగా ఆర్సీబీ తరపున!

మరిన్ని వార్తలు