‘ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపండి’

21 Nov, 2020 17:59 IST|Sakshi

మెల్‌బోర్న్‌:  ఫ్రాంచైజీ క్రికెట్‌పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ అలెన్‌ బోర్డర్‌. అక్టోబర్‌లో  టీ20 వరల్డ్‌కప్‌ ఆరంభం కావాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. కాగా, ఆ సమయంలోనే ఐపీఎల్‌ను బీసీసీఐ నిర్వహించింది. దీనిని తీవ్రంగా తప్పుబట్టాడు బోర్డర్‌. ప్రపంచస్థాయి గేమ్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా ఐపీఎల్‌ వంటి లీగ్స్‌కు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారని ప్రశ్నించాడు. ఈ విషయంలో ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు మేల్కోనాల్సిన అవసరం ఉందన్నాడు. ఆటగాళ్లను ఐపీఎల్‌కు వెళ్లకుండా ఆపాలని డిమాండ్‌ చేశాడు. తొలి ప్రాధాన్యత ఏదనే విషయం అందరికీ తెలిసినా, ఇక్కడ డబ్బు మాయలో అంతా పడిపోతున్నారన్నాడు. ఇది మంచి పరిణామం కాదని బోర్డర్‌ విమర్శించాడు. (వేరే జట్లకు చేయగలడా.. ఆ అవసరం నాకు లేదు: రోహిత్‌)

లోకల్‌ టోర్నీల కంటే వరల్డ్‌ గేమ్స్‌కే ప్రాముఖ్యత ఇవ్వాలన్నాడు. ఈ విషయంలో బోర్డులు ఆటగాళ్లను కట్టడి చేయాల్సిన ఇక నుంచైనా చేయాలన్నాడు.   ఇక కోహ్లి వంటి దూకుడైన ఆటగాళ్లు, టీమిండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా వంటి క్రికెట్‌ జట్లు టెస్టు క్రికెట్‌ను బ్రతికించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. పెరుగుతున్న ఫ్రాంచైజీ క్రికెట్‌ నుంచి టెస్టు క్రికెట్‌ను కాపాడాలని బోర్డర్‌ విన్నవించాడు.గత నెలలో బీసీసీఐపై బోర్డర్‌ విమర్శలు చేశాడు. బీసీసీఐ ఎప్పుడూ మైండ్‌ గేమ్‌ ఆడుతూ తమకు అనువుగా ప్రణాళికను ప్లాన్‌ చేసుకుంటుందని విమర్శించాడు. టీ20 వరల్డ్‌కప్‌ స్థానంలో ఐపీఎల్‌ నిర్వహించడంతో బోర్డర్‌ మండిపడ్డాడు.  వరల్డ్‌ క్రికెట్‌లో తాము శక్తివంతులమని బీసీసీఐ భావిస్తోందని, ఆర్థికంగా బలంగా ఉన్నా విషయాల్లో కచ్చితత్వం అనేది అవసరమని బోర్డర్‌ పేర్కొన్నాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు