T20 World Cup 2022: 'టీ20 ప్రపంచకప్‌ తుది జట్టులో వారిద్దరూ ఉండాలి'

11 Sep, 2022 12:29 IST|Sakshi
PC: BCCI

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2022కు భారత జట్టును బీసీసీఐ సెప్టెంబర్‌ 18న ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు టీ20 ప్రపంచకప్ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.

వీరిద్దరూ ప్రధాన జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం ఎవరో ఒకరికే చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ నుంచి కార్తీక్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కాగా ఆసియా కప్‌కు ఫినిషర్‌గా ఎంపికైన దినేష్ కార్తీక్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు.

అయితే రిషబ్‌ పంత్‌కు ఈ మెగా ఈవెంట్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్ తుది జట్టులో  రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ మధ్య ఎవరుండాలి అనే విషయమై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయంపై టీమిండియా వెటరన్‌ ఆటగాడు చెతేశ్వర్ పుజారా తన అభిప్రాయాలను వెల్లడించాడు. 

"వరల్డ్‌కప్‌ తుది జట్టులో దినేష్ కార్తీక్, పంత్‌ ఉండాలి. నేను నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7బ్యాటర్లను గనుక ఎంచుకోవాల్సి వస్తే.. వరుసగా పంత్‌, హార్దిక్ పాండ్యా, కార్తీక్‌కు అవకాశం ఇస్తాను. మా బ్యాటింగ్‌ లైనప్‌ మరింత పటిష్టంగా మారాలి.

అదే విదంగా భారత్‌ అదనపు బౌలింగ్ ఎంపిక కావాలంటే.. పంత్‌ స్థానంలో దీపక్ హుడాను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటే బాగుటుంది. ఒక వేళ హుడా తుది జట్టులోకి వచ్చినట్లయితే.. అతడిని ఐదో స్థానంలో బ్యాటింగ్‌ పంపాలి" అని పుజారా పేర్కొన్నాడు.
చదవండి: క్రికెట్‌కు అంగీకరిస్తేనే పెళ్లి.. వరుడి స్నేహితులు డీల్‌!

మరిన్ని వార్తలు