70 బంతుల్లో 236 పరుగులతో విధ్వంసం; బౌలర్‌ బూతుపురాణం

23 Jan, 2022 19:58 IST|Sakshi

మ్యాచ్‌ సీరియస్‌గా సాగుతున్నప్పుడు ఆటగాళ్ల ఎమోషన్స్‌ వివిధ రకాలుగా ఉంటాయి. ఒక బ్యాట్స్‌మన్‌ అదే పనిగా బౌండరీలు.. సిక్సర్లు బాదుతూ విధ్వంసం సృష్టిస్తుంటే.. బౌలర్లకు ఏ కోశానా మింగుడుపడదు.అలాంటిది బాదుడే లక్ష్యంగా పెట్టుకున్న బ్యాటర్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేస్తే.. బౌలర్‌కున్న ఎమోషనల్‌ లెవెల్స్‌ తారాస్థాయికి చేరుకుంటుంది. తాజాగా అలాంటి సంఘటనే విక్టోరియన్‌ ప్రీమియర్‌ క్రికెట్‌ లీగ్‌లో చోటుచేసుకుంది.

చదవండి: ఫామ్‌లో లేడనుకున్నాం..  దుమ్మురేపుతున్నాడు; టార్గెట్‌ అదేనా?

లీగ్‌లో భాగంగా కాంబర్‌వెల్‌ మాగ్‌పీస్‌, కింగ్‌స్టన్‌ హాత్రోన్‌ మధ్య 50 ఓవర్ల మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కాంబర్‌వెల్‌ మాగ్‌పీస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ క్రిస్టోఫర్ థెవ్లిస్ విధ్వంసమే సృష్టించాడు. 70 బంతుల్లోనే 20 ఫోర్లు, 24 సిక్సర్లతో 236 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. బంతి పడిందే ఆలస్యం అన్నట్లు బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అతని దెబ్బకు జట్టు స్కోరు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 441 పరుగులు చేసింది. మిగతావారిలో మరో ఓపెనర్‌ హమీష్‌ బుర్రిల్‌, థామస్‌ డొనాల్డ్‌సన్‌ అర్థసెంచరీలు చేశారు.

అయితే క్రిస్టోఫర్‌ థెవ్లిస్‌ 236 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను ఫీల్డర్‌ వదిలేశాడు. దాంతో చిర్రెత్తిపోయిన బౌలర్‌.. క్యాచ్‌ వదిలేసిన ఫీల్డర్‌పై బూతు పురాణం అందుకున్నాడు. ఆ తర్వాత మరో పరుగు మాత్రమే చేసి 237 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం 415 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  కింగ్‌స్టన్‌ హాత్రోన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ప్రజయ్‌ పరమేశ్‌ 66 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.

చదవండి: జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన..

మరిన్ని వార్తలు