కరోనాతో బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కన్నుమూత

4 May, 2021 18:45 IST|Sakshi

ఢిల్లీ: బాక్సింగ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌.కె. సాచేటి(56) కొవిడ్‌-19తో మంగ‌ళ‌వారం మృతిచెందారు. కొవిడ్ ఇన్‌ఫెక్షన్‌తో ఆయ‌న గ‌త కొన్ని రోజులుగా ఆసుపత్రిలో వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయ‌న మ‌ర‌ణం క్రీడా ప్రపంచంలో భారీ శూన్యతను మిగిల్చింద‌ని బీఎఫ్ఐ ఒక ప్రకట‌న‌లో తెలిపింది. సాచేటి ఐఓసీ ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ సభ్యుడుగా కూడా ఉన్నారు. సాచేటి మృతిపై కేంద్ర‌ క్రీడాశాఖ‌ మంత్రి కిర‌ణ్ రిజిజు విచారం వ్యక్తం చేశారు. ఆర్ కే సాచేటి కొవిడ్‌-19తో జ‌రిగిన యుద్ధంలో ఓడిపోయార‌న్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి బాక్సింగ్ దేశాల లీగ్‌లో భార‌త్‌ను ఉంచిన మూల స్తంభాల్లో ఆయ‌న ఒక‌ర‌న్నారు. సాచేటి మృతిప‌ట్ల ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంతాపం ప్రకటించింది.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు