భారత బాక్సర్‌ లవ్లీనాకు చుక్కెదురు

14 May, 2022 05:56 IST|Sakshi

టర్కీలో జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం భారత బాక్సర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్‌ (70 కేజీలు) పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగియగా... పూజా రాణి (81 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం ఆధ్వర్యంలోని ఫెయిర్‌ చాన్స్‌ టీమ్‌ బాక్సర్‌ సిండీ విన్నర్‌తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లవ్లీనా 1–4తో ఓడింది. పూజ 5–0తో టిమియా నాగీ (హంగేరి)పై గెలిచింది.

మరిన్ని వార్తలు