ధోనిలో ఉన్న గ్రేట్‌నెస్‌ అదే!

6 Oct, 2020 14:27 IST|Sakshi

దుబాయ్‌: జట్టు సభ్యులపై విశ్వాసం ఉంచి ముందుకు నడిపించడం మహేంద్ర సింగ్‌ ధోనిలోని గొప్పదనమని ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రెట్‌ లీ అన్నాడు. ఒత్తిడిలో కూడా మెరుగ్గా ఆడేందుకు ఇది దోహదపడుతుందని చెప్పాడు. ఫామ్‌ లేమితో ఇబ్బందులు పడుతున్న షేన్‌ వాట్సన్‌ని భుజం తట్టి ప్రోత్సహించడం వల్లనే గత మ్యాచ్‌లో రాణించగలిగాడని బ్రెట్‌లీ మీడియా చాట్‌లో పేర్కొన్నాడు. కాగా, కింగ్స్‌ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ వీరవిహారం చేసిన సంగతి తెలిసిందే.

పంజాబ్‌ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని డుప్లెసిస్‌తో కలిసి షేన్‌వాట్సన్‌ ఛేదించాడు. ఓపెనర్లు వాట్సన్‌ (53 బంతుల్లో 83 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), డుప్లెసిస్‌ (53 బంతుల్లో 87 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) హీరోచిత ఇన్నింగ్స్‌లతో మరో 14 బంతులు మిగిలిఉండగానే చెన్నై జట్టు 10 వికెట్లతో తేడాతో  భారీ విజయం సాధించింది. చెన్నైకి ఇది రెండో విజయం. ఇక తొలి నాలుగు మ్యాచుల్లో 52 పరుగులే చేసిన వాట్సన్‌ను కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధోని ఆడిస్తాడా? పక్కన పెడతాడా? అనే సందేహం కలిగింది అభిమానులకు. ఈ దశలో కెప్టెన్‌ ధోని వాట్సన్‌వైపు మొగ్గు చూపాడు.
(చదవండి: ఆ క్రెడిట్‌ అంతా వారిదే: డుప్లెసిస్‌)

మరిన్ని వార్తలు