బ్రెట్‌ లీ ఉన్నా సేవ్‌ చేయలేకపోయాడు!

24 Sep, 2020 20:22 IST|Sakshi
బ్రెట్‌ లీ-డీన్‌ జోన్స్‌(ఫైల్‌ఫోటో)

ముంబై: ప్రముఖ వ్యాఖ్యాత, ఆసీస్‌ దిగ్గజ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ గుండె పోటుకు గురై ఈరోజు(గురువారం) తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అయితే డీన్‌ జోన్స్‌కు గుండె పోటు వచ్చిన సమయంలో ఎవరూ ఆయన వద్ద లేరా అని ఇప్పటివరకూ అభిమానుల్లో ఒక ప్రశ్న మెదులుతూనే ఉంది. కాగా,  జోన్స్‌ వెంట ఆసీస్‌ మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ ఉన్నాడట. వీరిద్దరూ కలిసి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేసిన తర్వాత హోటల్‌ లాబీలో ఉన్నారట.  (చదవండి: జోన్స్‌ ఉదయం బాగానే ఉన్నారు.. అంతలోనే)

వీరిద్దరూ బ్రేక్‌ ఫాస్ట్‌ చేసి వచ్చిన కాసేపటికి జోన్స్‌ కు హార్ట్‌ ఎటాక్‌ గురయ్యారు. జోన్స్‌ను కాపాడటానికి లీ చేసిన ప్రయత్నం ఫలిచం లేదు.  సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్-శ్వాస పునరుద్ధరణ ప్రక్రియ) చేసినా జోన్స్‌ ను కాపాడలేకపోయాడు. సీపీఆర్‌ చేసినా జోన్స్‌ను కాపాడలేకపోయాననే పశ్చాత్తాపం బ్రెట్‌లీలో కనబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్‌ ముంబైలో ఉన్నారు. జోన్స్‌తో పాటు బ్రాడ్‌ కాస్టింగ్‌ కామెంటరీ చేస్తున్నాడు. కాగా, మధ్యాహ్నం గం.11.30 నుంచి గం 12.00 మధ్యలో డీన్‌ జోన్స్‌ తీవ్ర గుండెపోటుకు గురి కావడంతో తుదిశ్వాస విడిచారు. ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్‌ ఆడారు. తన క్రికెట్‌ కెరీర్‌ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు. (చదవండి: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ ఇకలేరు..)

మరిన్ని వార్తలు