కోహ్లి- అనుష్కలకు బ్రెట్‌ లీ ఆహ్వానం!

18 Dec, 2020 20:47 IST|Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్వదేశానికి తిరిగి రానున్న సంగతి తెలిసిందే. అతడి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ జనవరిలో తమ తొలి సంతానానికి జన్మనివ్వనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లి పితృత్వ సెలవుకు బీసీసీఐ కూడా అంగీకారంతో తెలపడంతో డిసెంబరు 21న మ్యాచ్‌ ముగియగానే ముంబైకి చేరుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రెట్‌ లీ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లి- అనుష్క శర్మ దంపతులు తమ జీవితంలోని మధురానుభూతులను పదిలం చేసుకునేందుకు తమ దేశానికి రావాలని ఆహ్వానించాడు. (చదవండివిరుష్క పెళ్లి పాట.. ‌ వీడియో రిలీజ్‌)

‘‘మిస్టర్‌ కోహ్లి.. మీకు గనుక ఇష్టం ఉన్నట్లయితే.. ఆస్ట్రేలియాలో మీ మొదటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. ఎందుకంటే మేం మీ రాకను స్వాగతిస్తాం. మీకు అబ్బాయి పుడితే అద్భుతం! అమ్మాయి పుడితే ఇంకా అద్భుతం!’’ అని బ్రెట్‌ లీ కాబోయే తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపాడు. కాగా ఆసీస్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేసి ఆలౌట్‌ అయిన కోహ్లి సేన ఆతిథ్య ప్రత్యర్థి జట్టును 191 పరుగులకు కట్టడి చేసింది. (చదవండి: టీమిండియా బౌలర్ల జోరు, ఆసీస్‌ బేజారు!)

మరిన్ని వార్తలు