#Football: 'కావాలని మాత్రం కాదు.. మనసులో ఏదో గట్టిగా పెట్టుకొనే!'

24 May, 2023 17:13 IST|Sakshi

ఫుట్‌బాల్‌ హెడ్‌బట్స్‌ షాట్‌ ఆడడం కామన్‌. ఈ క్రమంలో గాయాలు కావడం సహజం. కానీ ఉద్దేశపూర్వకంగా ఆటగాళ్లను గాయపరిచేలా  హెడ్‌బట్స్‌ షాట్‌ కొడితే మాత్రం తప్పు కిందే లెక్క. తాజాగా మహిళల ఫుట్‌బాల్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏఎఫ్‌ఏ మహిళల సాకర్‌ టోర్నమెంట్‌లో భాగంగా రేసింగ్‌, ఎల్‌ పొర్వినిర్‌ల మధ్య మ్యాచ్‌ జరిగింది.

మ్యాచ్‌లో ఎల్‌ పొర్వినిర్‌ ఆధిపత్యం చూపిస్తుంది. ఇది తట్టుకోని రేసింగ్‌ ఢిపెండర్‌ మారియా బెలెన్‌ తర్బోడా ఎదురుగా వస్తున్న లుడ్మిలా రమ్రెజ్‌ ముఖాన్ని తన తలతో ఒక్క గుద్దు గుద్దింది. దీంతో రమ్రెజ్‌ కిందపడిపోయింది. ఆమె నుదుటి చిట్లి రక్తం కారింది. ఇది గమనించిన రిఫరీ పరిగెత్తుకొచ్చి ఏదో పొరపాటులో జరిగిందేమో అనుకొని ఎల్లో కార్డ్‌ చూపించింది. ఇదే సమయంలో రమ్రెజ్‌ మొహం రక్తంతో నిండిపోయింది.

ఇది గమనించిన రిఫరీ ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్‌ తలను పగులగొట్టినందుకు గాను మారియా బెలెన్‌కు రెడ్‌కార్డ్‌ చూపించింది. ఇది సహించని మారియా కాసేపు వాగ్వాదానికి దిగింది. రిఫరీ తన రెడ్‌కార్డ్‌కే కట్టుబడి ఉండడంతో చేసేదేం లేక మైదానాన్ని వీడింది. ఆ తర్వాత ఎల్‌  పొర్వినిర్‌కు వచ్చిన పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకొని గోల్‌ కొట్టి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లడమే గాక మ్యాచ్‌ను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ''ఇది కచ్చితంగా కావాలని చేయలేదు.. మనసులో ఏదో పెట్టుకొనే ఈ పని చేసినట్లుంది'' అని కామెంట్‌ చేశారు.

చదవండి: ప్లాన్‌ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా?

మరిన్ని వార్తలు