IPL 2022: వరుసగా ఐదు ఓటములు.. ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.?

14 Apr, 2022 13:45 IST|Sakshi
Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో ముంబై బోణి కొట్టలేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది పాయింట్ల పట్టికలో అఖరి స్థానంలో నిలిచింది. ముంబై బ్యాటింగ్‌ పరంగా రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపడంలేదు. 

ఇక ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా అన్న ప్రశ్న అందరిలో నెలకొంది. కాగా ఐపీఎల్‌-2014లో కూడా వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చెందిన ముంబై ... పడి లేచిన కెరటంలా  వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.. అయితే ఈ సారి కూడా అదే రిపీట్‌ అవుతుందని కొంత మంది అభిప్రాయపడుతుండగా... మరి కొంత మంది ముంబై పని అయిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు. 

ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించాలంటే..
ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో మరో 9 లీగ్‌ మ్యాచ్‌లు ఆడనుంది. 9 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లు విజయం సాధిస్తానే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కాగా  ముంబై మరో ఓటమి చవిచూస్తే.. వారి ప్లేఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఇక పాయింట్ల పట్టికలో రాజస్తాన్‌ రాయల్స్‌,  కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మొదటి 4 స్థానాల్లో నిలిచాయి.

ముంబై జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి, డేనియల్ సామ్స్, ఫాబియన్ సింగ్, అన్మోల్‌ప్రీత్ , సంజయ్ యాదవ్, రిలే మెరెడిత్, మయాంక్ మార్కండే, టిమ్ డేవిడ్, ఆర్యన్ జుయల్, అర్జున్ టెండూల్కర్, హృతిక్ షోకీన్, రాహుల్ బుద్ధి, అర్షద్ ఖాన్, రమణదీప్ సింగ్

చదవండి: IPL 2022 PBKS Vs MI: దటీజ్‌ జానియర్‌ 'ఏబీ'.. ఐపీఎల్‌ 2022లోనే భారీ సిక్సర్‌.. వైరల్‌

మరిన్ని వార్తలు