క్యాచ్‌ పట్టేస్తారని మధ్యలో దూరింది; ఔట్‌ కాదా.. ఇదెక్కడి రూల్‌

1 Nov, 2021 18:33 IST|Sakshi

Canadian Cricketer Blatant Cheating.. క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు జరగడం సహజం. తన వికెట్‌ను కాపాడుకోవడానికి ఒక బ్యాటర్‌ చేసిన పని ఆమెను నవ్వులపాలు చేసింది. ఐసీసీ లాంటి టోర్నీల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సగటు క్రికెట్‌ అభిమానులను ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. విషయంలోకి వెళితే.. ఐసీసీ వుమెన్స్‌ టి20 ప్రపంచకప్‌ అమెరికాస్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా గతవారం కెనడా, అమెరికా మధ్య మ్యాచ్‌ జరిగింది.  మ్యాచ్‌లో తొలుత కెనడా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ దివ్య సక్సేనా ఓవర్‌ మూడో బంతిని గాల్లోకి లేపింది.

ప్రత్యర్థి వికెట్‌ కీపర్‌ సిందూ శర్మ క్యాచ్‌ పట్టుకునే ప్రయత్నం చేయగా.. మధ్యలో దూరి కీపర్‌ను క్యాచ్‌ తీసుకోకుండా అడ్డుపడింది. క్రికెట్‌ నిబంధనల్లో లా 37.3 ప్రకారం ఒక బ్యాటర్‌ తాను ఔట్‌ కాకూడదని ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి ప్లేయర్‌కు అడ్డురావడం ''అబ్‌స్ట్రక్టింగ్‌ ది ఫీల్డ్‌'' కింద పరిగణిస్తారు. అలా చేస్తే సదరు బ్యాటర్‌ ఔట్‌ అని క్రికెట్‌ పుస్తకాల్లో ఉంది. కానీ ఇక్కడ మాత్రం దివ్య సక్సేనా ఔట్‌ కాదంటూ అంపైర్‌ నిగిల్‌ డుగ్డిడ్‌ ప్రకటించడం అందర్ని ఆశ్చర్యపరించింది. ఆ తర్వాత దివ్య సక్సేనా 40 పరుగులు చేయడం.. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అమెరికా 7 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఒకవేళ దివ్య సక్సేనాను అంపైర్‌ ఔట్‌ అని ప్రకటించి ఉంటే మ్యాచ్‌ను అమెరికా గెలిచి ఉండేది.  

చదవండి: Jasprit Bumrah: ఆరు నెలలుగా బయోబబూల్‌.. మమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది

తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఐసీసీ షేర్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జిమ్మీ నీషమ్‌ స్పందించాడు.'' క్రికెట్‌ రూల్స్‌ ప్రకారం ఇది చీటింగ్‌ అని అందరికి తెలుసు.. కానీ ఎందుకో వీడియో చూస్తే ఫన్నీగా అనిపించింది.'' అంటూ కామెంట్‌ చేశాడు. ఇక వీడియో చూసిన అభిమానులు వినూత్న రీతిలో స్పందించారు. ''ఆమె అంత చీటింగ్‌ చేసినా ఔట్‌ కాదంటా.. ఇదెక్కడి దిక్కుమాలిన రూల్‌..'' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు