మా ఆయన మహా ముదురు.. అప్పటికే గర్ల్‌ ఫ్రెండ్‌ ఉండేది

4 Jun, 2021 21:26 IST|Sakshi

సిడ్నీ: ఆసీస్‌ విధ్వంసకర వీరుడు డేవిడ్‌ వార్నర్‌ వ్యక్తిగత విషయాలను అతని భార్య క్యాండీస్‌ వార్నర్‌ మీడియాకు వెల్లడించింది. గత వారం ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వార్నర్‌కు ఆమెకు మధ్య పరిచయం ఎలా ఏర్పడిందన్న విషయాన్ని మీడియా ముందు బహిర్గతం చేసింది. వివాహానికి రెండేళ్ల ముందు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా తాము తొలిసారి కలుసుకున్నామని, ఆ సమయంలో వార్నర్ చాలా మొరటుగా, అహంకారిగా కనిపించాడని పేర్కొంది. వార్నర్‌ బయటికి కనిపించేంత ఆమాయకుడు కాదని, అప్పటికే ఓ గర్ల్ ఫ్రెండ్‌ను కూడా మెయింటైన్‌ చేసేవాడని చెప్పుకొచ్చింది. 

తాము ఒకే ప్రాంతంలో 500 మీటర్ల దూరంలో పెరిగినా ఒకరికొకరు పరిచయం లేదని ఆమె తెలిపింది. వార్నర్‌ను తొలిసారి టీవీలో చూసాక, సోషల్ మీడియా వేదికగా తనే మొదట మేసేజ్ చేశానని వెల్లడించింది. అలా మొదలైన తమ ప్రేమ.. రెండేళ్ల అనంతరం వివాహానికి దారితీసిందని చెప్పింది. కాగా, వార్నర్‌, క్యాండీస్‌ల వివాహం 2015లో జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఇదిలా ఉంటే, కరోనా కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ అర్ధంతరంగా రద్దు కావడంతో ఇటీవలే కుటుంబ సభ్యులను కలుసుకున్న వార్నర్‌.. కొద్ది రోజులుగా కుటుంబంతో జాలీగా గడుపుతున్నాడు. అయితే, ఈ ఆసీస్‌ వెటరన్‌ ప్లేయర్‌ కొద్ది రోజుల్లో మళ్లీ బిజీ కానున్నాడు. జూలైలో విండీస్‌లో పర్యటన, ఆతర్వాత యూఏఈలో ఐపీఎల్‌, ఆ వెంటనే భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ ఇలా వరుస విదేశీ పర్యటనలతో బిజీ అయిపోనున్నాడు.
చదవండి: ముంబై టు లండన్‌.. అలా సాగిపోయింది

మరిన్ని వార్తలు