Bhaninaben Patel: భవీనా పటేల్‌కు రజతం.. ప్రముఖుల ప్రశంసల వెల్లువ

29 Aug, 2021 13:18 IST|Sakshi

ఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించిన భవీనాబెన్‌ పటేల్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రధాని, రాష్ట్రపతి మొదలుకొని పలువురు సెలబ్రిటీలు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. రజతం సాధించిన భవీనా పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

టోక్యో పారాలింపిక్స్ 2020 లో  కృషి, పట్టుదల, సంకల్పంతో రజత పతకం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భావినాబెన్ పటేల్‌ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. పటేల్ తన అత్యుత్తమ ప్రదర్శనతో దేశం గర్వపడేలా చేసారన్నారు. టోక్యో పారాలింపిక్స్ క్రీడలలో టేబుల్ టెన్నిస్‌లో ఆమె సాధించిన రజత పతకం దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని గవర్నర్ అన్నారు.

చదవండి: పారాలింపిక్స్‌లో భవీనా కొత్త అధ్యాయం.. 12 నెలల వయసులో పోలియో బారిన పడినప్పటికీ..

► పారాలింపిక్స్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన భవీనా.. భారత బృధానికి, క్రీడాభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. మీ అసాధారణ సంకల్పం, నైపుణ్యాలు భారతదేశానికి కీర్తిని తెచ్చాయి. మీకు నా అభినందనలు
- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

► భవీనా పటేల్‌ చరిత్ర లిఖించింది. దేశానికి ఆమె చారిత్రక సిల్వర్‌ మెడల్‌ తీసుకొచ్చింది. ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ప్రయాణం యువతను క్రీడలవైపు ఆకర్షిస్తుంది
- ప్రధాని నరేంద్ర మోదీ

► టోక్యో పారాలింపిక్స్ 2020లో టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించిన భవీనా పటేల్‌కు అభినందనలు. ఆమె సాధించిన విజయం దేశానికి గర్వకారణం. భవిష్యత్తులో ఆమె మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మరిన్ని వార్తలు