chamika Karunaratne: 'ఊడిన పళ్లు వెనక్కి.. మూతికి 30 కుట్లు'

9 Dec, 2022 09:28 IST|Sakshi

శ్రీలంక క్రికెటర్‌ చమిక కరుణరత్నే క్యాచ్‌ పట్టబోయి మూతిపళ్లు రాలగొట్టుకున్న సంగతి తెలిసిందే. లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గాలే గ్లాడియేటర్స్‌, జఫ్నా కింగ్స్‌ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా నోటి నుంచి రక్తం కారడంతో ప్రథమ చికిత్స తీసుకొని మళ్లీ మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్‌ తర్వాత కరుణరత్నేను ఆసుపత్రికి తరలించి మూతికి సర్జరీ నిర్వహించారు. మూతికి 30 కుట్లు కూడా పడ్డాయి. ప్రస్తుతం కరుణరత్నే విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఇదే విషయాన్ని కరుణరత్నే తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చాడు. ''నాలుగు పళ్లు ఉడినా తిరిగి వచ్చాయి.. మూతికి 30 కుట్టు పడ్డాయి.. కానీ నేను ఇప్పటికి నవ్వగలను. త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తా.. సీ యూ సూన్‌'' అంటూ మెసేజ్‌ చేశాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. కాండీ ఫాల్కన్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గాలే గ్లాడియేటర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మోవిన్‌ శుభసింగా 38 బంతుల్లో 40 పరుగులు, ఇమాద్‌ వసీమ్‌ 34 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన ఫాల్కన్స్‌ 30 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. కమిందు మెండిస్‌ 44, పాతుమ్‌ నిస్సాంక(22), ఆండ్రీ ఫ్లెచర్‌(20) పరుగులు చేశారు. 

A post shared by Chamika Karunaratne (@chamikakarunaratne)

చదవండి: LPL 2022: మూతిపళ్లు రాలినా క్యాచ్‌ మాత్రం విడువలేదు

ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా?

మరిన్ని వార్తలు