100వ టెస్టులో డబుల్‌ సెంచరీ, వాటే బ్యాటింగ్‌!

6 Feb, 2021 15:07 IST|Sakshi

చెన్నై: భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ టీమిండియాతో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్‌ సెంచరీ చేశాడు. రూట్‌ (377 బంతుల్లో 218; 19 ఫోర్లు, 2 సిక్సర్లు‌) గ్రేట్‌ ఇన్నింగ్స్‌తో పర్యాటక జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి ఇప్పటికి 481 స్కోరుతో ఉంది. ప్రస్తుతం రెండో రోజు మూడో సెషన్‌ కొనసాగుతుండగా.. జోస్‌ బట్లర్‌ (5), డొమినిక్‌ బెస్‌ (1)‌ క్రీజులో ఉన్నారు. సిబ్లీ 87, బెన్‌ స్టోక్స్‌ 82 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా, అశ్విన్‌, నదీం తలో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. పిచ్‌ నుంచి సహకారం లేకపోవడంతో వికెట్లు కూల్చేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడ్చక తప్పడం లేదు.(చదవండి: India Vs England 2021: వరుస ఓవర్లలో 2 వికెట్లు)

రికార్డుల రూట్‌..

  • 2021లో రూట్‌ ఆడిన మూడు టెస్టుల్లో రెండు డబుల్‌ సెంచరీలు చేశాడు.
  • శ్రీలంక పర్యటనలో రూట్‌ చలవతో ఇంగ్లండ్‌ రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది.
  • 100వ టెస్టు ఆడుతున్న ఈ ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మన్‌కు ఇది ఐదో డబుల్‌ సెంచరీ. 
  • 100 వ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ఇంజామామ్‌ ఉల్‌ హక్‌ 184 పరుగుల రికార్డను రూట్‌ తిరగరాశాడు. 
  • శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో వరుసగా.. 228, 184 పరుగులు చేశాడు.
  • చెన్నై టెస్టులో డబుల్‌ సెంచరీ సాధించి.. ఆసియా ఖండంలో వరసగా మూడు సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డు.
  • 100 టెస్టులో 100 బాదిన 9వ బ్యాట్స్‌మన్‌ రూట్‌.
  • ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ తన తొలి టెస్టును (నాగ్‌పూర్‌–2012), 50వ టెస్టును (విశాఖపట్నం–2016), 100వ టెస్టును (చెన్నై–2021) భారత్‌పై భారత్‌లోనే ఆడటం విశేషం.
మరిన్ని వార్తలు