Chess Olympiad 2022: అజేయంగా భారత్‌ ‘ఎ’

3 Aug, 2022 13:56 IST|Sakshi

చెన్నై: ప్రతిష్టాత్మక చెస్‌ ఒలింపియాడ్‌ ఓపెన్‌ విభాగంలో భారత్‌ ‘ఎ’ ఖాతాలో నాలుగో విజయం చేరింది. మంగళవారం జరిగిన ఐదో రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 2.5–1.5తో రొమేనియాపై గెలిచింది. పెంటేల హరికృష్ణ–బొగ్డాన్‌ గేమ్‌ 31 ఎత్తుల్లో... విదిత్‌–లుపులెస్కు గేమ్‌ 31 ఎత్తుల్లో... నారాయణన్‌–జియాను గేమ్‌ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగియగా... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 46 ఎత్తుల్లో పరిల్‌గ్రాస్‌ను ఓడించి భారత్‌కు విజయాన్ని అందించాడు.

మరో మ్యాచ్‌లో భారత్‌ ‘బి’ 2.5–1.5తో స్పెయిన్‌పై గెలిచి ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేయగా...భారత్‌ ‘సి’ 2.5–1.5తో చిలీపై నెగ్గింది. మహిళల విభాగంలో భారత్‌ ‘ఎ’ 2.5–1.5తో ఫ్రాన్స్‌పై గెలుపొందగా... భారత్‌ ‘బి’ 1–3తో జార్జియా చేతిలో ఓడిపోయింది. భారత్‌ ‘సి’–బ్రెజిల్‌ మధ్య మ్యాచ్‌ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. 

మరిన్ని వార్తలు