చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం

9 May, 2021 14:25 IST|Sakshi

భవ్‌నగర్‌(గుజరాత్‌): గుజరాత్‌ పేస్‌ బౌలర్‌ చేతన్‌ సకారియా ఇంట మరో విషాదం నెలకొంది. సకారియా తండ్రి కన్‌జిభాయ్‌ సకారియా కరోనాతో మృతిచెందారు. గత కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడిన కన్‌జిభాయ్‌ సకారియా చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున చేతన్‌ సకారియా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

‘సకారియా ఇంట విషాదం నెలకొందనే విషయాన్ని తెలియజేయడం బాధిస్తోంది. కోవిడ్‌-19తో పోరాడిన చేతన్‌ సకారియా తండ్రి కన్‌జిభాయ్‌ చివరకు ఓడిపోయారు. ఈ రోజు ఉదయం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇది చేతన్‌ సకారియాకు అండగా ఉండాల్సిన సమయం. మాకు సాధ్యమైనంత చేయూతను సకారియా కుటుంబానికి అందజేస్తాం. మేము చేతన్‌ సకారియాతో టచ్‌లో ఉన్నాం. ఇది అతనికి కష్టకాలం’ రాజస్థాన్‌ రాయల్స్‌ ట్వీట్‌ చేసింది.   

ఈ ఏడాది జనవరిలో చేతన్‌ సకారియా సోదరుడు మృతి చెందగా, ఇప్పుడు తండ్రి కన్నుమూయడంతో సకారియా ఇంట తీవ్ర విషాదం నెలకొంది.  ఫిబ్రవరిలో జరిగిన ఐపీఎల్ వేలానికి కొద్ది రోజుల ముందే సకారియా తన తమ్ముడిని ల్పోయాడు. జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఆడుతున్న సమయంలో అతని తమ్ముడు రాహుల్‌ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అయితే ఆ సమయంలో ఈ విషాద వార్తను తల్లిదండ్రులు సకారియాకు తెలీనివ్వలేదు. తమ్ముడంటే సకారియాకు చాలా ఇష్టమని, దీంతో అతను ఎక్కడ డిస్టర్బ్ అవుతాడోనన్న భయంతో విషయం అతనికి చెప్పలేదని, ఆతర్వాత మెల్లగా తన తమ్ముడు లేడన్న వార్తను తెలియజేశామని తల్లిదండ్రులు తెలిపారు. 

ఇక్కడ చదవండి: ఇంత బాగా రాణిస్తాడని అస్సలు ఊహించలేదు: సెహ్వాగ్
టెంపో డ్రైవర్‌గా తండ్రి కష్టం, తమ్ముడి ఆత్మహత్య కలిచివేశాయి..

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు