Asia Cup 2022: పాక్‌ క్రికెటర్‌పై పుజారా ప్రశంసల వర్షం

25 Aug, 2022 20:58 IST|Sakshi

టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా.. పాకిస్తాన్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆగస్టు 28న భారత్‌, పాకిస్తాన్‌ మధ్య హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో పుజారా వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పుజారా కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉండగా.. మహ్మద్‌ రిజ్వాన్‌ ఆసియాకప్‌ కోసం జట్టుతో పాటు యూఏఈ చేరుకున్నాడు.

విషయంలోకి వెళితే.. కౌంటీ చాంపియన్‌షిప్‌లో పుజారా, మహ్మద్‌ రిజ్వాన్‌లు ససెక్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మహ్మద్‌ రిజ్వాన్‌తో కలిసి కౌంటీ ఆడడంపై మీ అభిప్రాయం ఏంటి అని ఒక అభిమాని పుజారాకు ప్రశ్న వేశాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా రిజ్వాన్‌తో కలిసి ఆడిన క్షణాలను పుజారా గుర్తు చేసుకున్నాడు.

''మహ్మద్‌ రిజ్వాన్‌ మంచి టాలెంటెడ్‌ క్రికెటర్‌. అతనితో కలిసి ఆడిన సందర్భాన్ని చాలా ఎంజాయ్‌ చేశాను. వ్యక్తిగతంగానూ చాల మంచోడు.'' అని చెప్పుకొచ్చాడు. ఇక వన్డే క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతుందని అంటున్నారు.. దీనిపై మీరేమంటారు అని మరొక అభిమాని ప్రశ్నించాడు. దీనికి పుజారా..'' అవును వన్డే క్రికెట్‌ ఆదరణ కోల్పోవడం దురదృష్టకరం.'' అంటూ పేర్కొన్నాడు. 

ఇక ఇంగ్లండ్‌తో టెస్టు ముగిసిన అనంతరం కౌంటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న పుజారా వరుస సెంచరీలతో హోరెత్తించాడు. ఆ తర్వాత రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లోనూ పుజారా బ్యాటింగ్‌లో ఇరగదీస్తున్నాడు. మంగళవారం మిడిలెసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పుజారా కేవలం 90 బంతుల్లోనే 20 ఫోర్లు, 2 సిక్సర్లతో 132 పరుగులతో విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో పుజారా స్ట్రైక్‌ రేట్‌ 146.66 దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అతను ఎంత భీకరమైన ఫామ్‌లో ఉన్నాడనేది.. ఇటివలే లిస్ట్‌-ఏ క్రికెట్‌లోనూ పుజారా 5వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

చదవండి: ICC T20 WC 2022: భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. అభిమానులకు గుడ్‌న్యూస్‌

టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్‌! కానీ కోహ్లి మాత్రం..

మరిన్ని వార్తలు