Cheteshwar Pujara: 2017లో ‘అర్జున’ అవార్డుకు ఎంపిక.. ఇప్పుడు అందుకున్న పుజారా

21 Nov, 2022 12:28 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా ఎట్టకేలకు ఐదేళ్ల తర్వాత తనకు ప్రకటించిన ‘అర్జున’ అవార్డును అందుకున్నాడు. క్రికెట్లో రాణిస్తున్న అతన్ని 2017లోనే భారత ప్రభుత్వం ఆ అవార్డుకు ఎంపిక చేసింది. కానీ టీమిండియా బిజీ షెడ్యూల్‌ వల్ల ఆ ఏడాది అందుకోలేకపోయాడు.

ఢిల్లీలో ప్రస్తుతం సౌరాష్ట్ర తరఫున విజయ్‌ హజారే ట్రోఫీ ఆడుతున్న అతనికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ‘అర్జున’ పురస్కారం బహూకరించారు. దీనిపై స్పందించిన పుజారా తనను ప్రోత్సహించిన బోర్డు (బీసీసీఐ)కు, తన ఘనతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు. 
చదవండి: IND vs NZ: వన్డే, టీ20ల్లో అయిపోయింది...ఇక టెస్టుల్లోకి సూర్యకుమార్‌!

మరిన్ని వార్తలు