Cheteshwar Pujara On IPL 2022: 'ఐపీఎల్‌లో ఆడకపోవడం మంచిదైంది.. అందుకే మళ్లీ తిరిగి వచ్చా'

23 May, 2022 19:07 IST|Sakshi

ఇంగ్లండ్‌తో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిం‍దే. అయితే జట్టు నుంచి ఊధ్వసనకు గురైన వెటరన్‌ ఆటగాడు ఛతేశ్వర్‌ పుజారా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ మెగా వేలంలో పాల్గొన్న పుజారాను ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దీంతో ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడటానికి పుజరా నిశ్చయించకున్నాడు.

ఇక కౌంటీల్లో ఆడుతోన్న పుజారా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌లో పుజారా 720 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో నాలుగు సెంచరీలు ఉన్నాయి. కౌంటీల్లో అద్భుతంగా రాణిస్తున్న పుజారాను సెలకెటర్లు ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ క్రమంలో తన ఎంపికపై స్పందించిన పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో ఆడకపోవడమే తనకు మంచిదైందని పుజారా తెలిపాడు. 


"మీరు ఇప్పుడు ఆలోచించి చెప్పండి. ఒక వేళ నన్ను ఐపీఎల్‌లో ఏదైనా జట్టు కొనుగోలు చేసి ఉంటే.. నాకు తుది జట్టులో అసలు అవకాశం దొరికేది కాదు. నేను నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం తప్ప ఇంకా ఏమి ఉండేది కాదు. అదే ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడితే జట్టులో చోటుతో పాటు ప్రాక్టీస్‌ కూడా లభిస్తుంది. అందుకే కౌంటీల్లో ఆడటానికి నిర్ణయించుకున్నాను. నేను నా రిథమ్‌ను పొందడానికి ఇంగ్లండ్‌కు వెళ్లాను. నేను ఇక్కడకు వచ్చేటప్పడే పాజిటివ్ దృక్పథంతో వచ్చాను. కానీ టీమిండియాలోకి రీఎంట్రీ కోసం మాత్రం నేను ఆడలేదు. నాఫామ్‌ను తిరిగి పొందడానికి ఒక  పెద్ద ఇన్నింగ్స్‌ సహాయపడుతుందని నాకు తెలుసు" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా పేర్కొన్నాడు.

చదవండి: IND Vs SA T20: డీకేను సెలక్ట్‌ చేసినపుడు ధావన్‌ను ఎందుకు పక్కనపెట్టారు: టీమిండియా మాజీ ఆటగాడు


 

మరిన్ని వార్తలు