చైనా నుంచి తొలి ఫార్ములావన్‌ డ్రైవర్‌... 

17 Nov, 2021 08:22 IST|Sakshi

బీజింగ్‌: ఇన్నాళ్లూ లోటుగా ఉన్న ఫార్ములావన్‌ (ఎఫ్‌1) క్రీడలోనూ చైనా దేశం క్రీడాకారుడు తొలిసారి కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఎఫ్‌1 సీజన్‌లో చైనాకు చెందిన గ్వాన్‌యూ జౌ అరంగేట్రం చేయనున్నాడు. ప్రస్తుతం ఫార్ములా-2 విభాగంలో పోటీపడుతున్న 22 ఏళ్ల గ్వాన్‌యూ జౌతో ఆల్ఫా రొయెయో జట్టు ఒప్పందం చేసుకుంది.

గత మూడేళ్లుగా ఆల్ఫా రొమెయోకు డ్రైవర్‌గా ఉన్న జియోవినాజి కాంట్రాక్ట్‌ ఈ సీజన్‌తో ముగుస్తుంది. వచ్చే సీజన్‌లో అతడి స్థానాన్ని గ్వాన్‌యూ జౌతో భర్తీ చేస్తారు.

చదవండి: Football World Cup 2022: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌.. 16వసారి...  

మరిన్ని వార్తలు