టి10 లీగ్‌ను ఒలింపిక్స్‌లో చేరిస్తే బాగుంటుంది

8 Jan, 2021 21:30 IST|Sakshi

జమైకా: ఒలింపిక్స్‌కి టి10 ఫార్మాట్‌ క్రికెట్‌ సెట్‌ అవుతుందని విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రికెట్‌ క్రిస్‌ గేల్‌ అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని శుక్రవారం ట్విట్టర్‌ ఈ విషయాన్ని పోస్ట్‌ చేశాడు. టి 10 ఫార్మాట్‌ అయితే కేవలం 90 నిమిషాల్లోనే మ్యాచ్‌ పూర్తయి ఫలితం వస్తుందన్నాడు. అదే టీ20 ఫార్మాట్‌ అయితే ఒక్కో మ్యాచ్‌ ముగిసేందుకు కనీసం 3గంటల సమయం పట్టవచ్చన్నాడు. సమయాభావంతోనే క్రికెట్‌కు ఒలింపిక్స్‌లో చోటు దక్కలేదని, అమెరికాలోనూ ఇటీవల టి10 లీగ్‌ జరగడంతో అక్కడా క్రికెట్‌కు ఆదరణ లభిస్తోందని గేల్‌ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఎనిమిది జట్ల మధ్య అబుదాబి టి10 లీగ్‌ జనవరి 28నుంచి జరగనుండగా.. క్రిస్‌ గేల్‌ అబుదాబి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మరిన్ని వార్తలు