Chris Gayle: హెడ్‌ కోచ్‌గా క్రిస్‌ గేల్‌.. ఏ జట్టుకో తెలుసా?

19 Feb, 2022 21:01 IST|Sakshi

వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ క్రిస్ గేల్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. వచ్చే ఏడాది పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తానని గేల్‌ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌-2022 లో కరాచీ కింగ్స్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కరాచీ కింగ్స్‌ ఒకే ఒక విజయం సాధించింది. కరాచీ కింగ్స్‌కు బాబర్‌ ఆజాం సారథిగా ఉన్నాడు. "వచ్చే సీజన్‌లో కరాచీ కింగ్స్‌కు నేను కొత్త ప్రధాన కోచ్‌ని అవుతాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు" అని గేల్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు.

కాగా ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఫార్చ్యూన్ బారిషల్ జట్టుకు యూనివర్స్ బాస్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక ఐపీఎల్‌-2022కు కూడా క్రిస్‌ గేల్‌ దూరంగా ఉన్నాడు. 79 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 1899 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా తన టీ20 కేరిర్‌లో 445 మ్యాచ్‌లు ఆడిన గేల్‌ 14,321 పరుగులు చేశాడు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో కేవలం 66 బంతుల్లో 175 పరుగులు చేసి యూనివర్స్ బాస్  ప్రపంచ రికార్డు సృష్టించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి గేల్‌ తప్పుకోవాలని భావిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

చదవండి: 19 ఫోర్లు..2 సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్‌ ఆటగాడు!

మరిన్ని వార్తలు