Chris Gayle: క్రిస్‌ గేల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ యునివర్స్ బాస్ మెరుపులు!

5 Aug, 2022 16:23 IST|Sakshi

యూనివర్సల్‌ బాస్‌, వెస్టిండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ లెజెండ్స్ లీగ్ క్రికెట్‌ సెకెండ్‌ సీజన్‌లో సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని జెండ్స్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న గేల్‌ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపించడానికి సిద్దమయ్యాడు. కాగా టీ20 క్రికెట్‌కే కింగ్‌గా ఉన్న గేల్‌ తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్నాడు.

టీ20‍ల్లో 10,000 పరుగులు, అత్యధిక సెంచరీలు, అత్యంత వేగవంతమైన సెంచరీ, అత్యధిక ఫోర్లు, సిక్స్‌లు వంటి చాలా రికార్డులు గేల్‌ ఖాతాలో ఉన్నాయి. కాగా వ్యక్తిగత కారణాలు వల్ల ఐపీఎల్‌-2022కు గేల్‌ దూరమయ్యాడు. ఇక లెజెండ్స్ లీగ్‌లో తను భాగంకానున్నట్లు గేల్‌ కూడా దృవీకరించాడు.  "ఈ ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో భాగం కావడం.. దిగ్గజాలతో కలిసి ఆడటం నాకు అపారమైన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

భారత్‌లోని మ్యాచ్ వేదికల వద్ద కలుద్దాం" అని ఒక ప్రకటనలో గేల్‌ పేర్కొన్నాడు. ఇక లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనుంది. ఈ టోర్నీకి కోల్‌కతా, లక్నో, ఢిల్లీ, జోధ్‌పూర్, కటక్,రాజ్‌కోట్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. లెజెండ్స్ లీగ్ రెండో సీజన్‌లో తొమ్మిది దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు పాల్గొనున్నారు
చదవండి: Asia Cup 2022: 'గతేడాది పాక్ చేతిలో ఓటమి భారత్‌ను బాగా డ్యామేజ్ చేసింది.. ఈ సారి మాత్రం'

మరిన్ని వార్తలు