ప్రధాని మోదీ నుంచి పర్సనల్‌ మెసేజ్‌: క్రిస్‌ గేల్‌

26 Jan, 2022 11:25 IST|Sakshi

విండీస్‌ హార్డ్‌ హిట్టర్‌.. యునివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌కు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం.ఈ విషయాన్ని ఇంతకముందు చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ద్వారా గేల్‌ భారత క్రికెట్‌ అభిమానులకు మరింత చేరువయ్యాడు. తాజాగా జనవరి 26న భారత్‌ 73వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా క్రిస్‌ గేల్‌ భారతీయులకు తన స్టైల్లో శుభాకాంక్షలు తెలిపాడు.

చదవండి: Kohli Vs BCCI: కోహ్లి,గంగూలీ ఒకసారి ఫోన్‌లో మాట్లాడుకోండి: కపిల్‌ దేవ్‌

''భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్‌ మెసేజ్‌తో ఈరోజు నిద్ర లేచా. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులకు ఇవే నా శుభాకాంక్షలు. మోదీతో పాటు దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మీ దేశ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్‌ సహా ఇతర క్లబ్‌ క్రికెట్‌లో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తుంటా. కంగ్రాట్స్‌ ఫ్రమ్‌ యునివర్సల్‌ బాస్‌'' అంటూ ట్వీట్‌ చేశాడు. 

ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఆర్‌సీబీ, పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు. దీనిలో ఆర్‌సీబీ తరపున 91 మ్యాచ్‌ల్లో 3420 పరుగులు సాధించాడు. కోహ్లి, డివిలియర్స్‌ తర్వాత ఆ జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా గేల్‌ నిలిచాడు. అయితే ఈసారి ఐపీఎల్‌లో మాత్రం గేల్‌ మెరుపులు మిస్‌ కానున్నాయి. ఐపీఎల్‌ మెగావేలానికి సంబంధించి ప్లేయర్ల వేలం జాబితాలో గేల్‌ రిజిస్టర్‌ చేసుకోలేదు. ఈ కారణంగా గేల్‌ వేలానికి దూరమయ్యాడు. ఇక క్రిస్‌ గేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌ తరపున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టి20లు ఆడాడు.

చదవండి: Neeraj Chopra: నీరజ్‌ చోప్రాకు విశిష్ట పురస్కారం

మరిన్ని వార్తలు